| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | ఈశ్వరుడు |

| ఈశ్వరుడు |
లోకమ్ము వారికీ రొండు కన్నుల్లు; లోకరక్షక, నీకు వేయికన్నుల్లు! ఇద్దరుపెండ్లాలు, ఈశ్వరుడ నీకు; పలువరుస చక్కనిది పార్వతీదేవి! కన్నుల్లు చక్కన్న కనకదుర్గకును, ఇద్దరుపెండ్లాము లేలయ్య నీకు? ఎద్దెక్కి తిరిగేవు ఈశ్వరుడ నీవు, బిచ్చమెత్తిందాక బిడ్డలకు లేదు! అడిగి తెచ్చిందాక ఆలికే లేదు!! |
