| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | చెలిమి |

| చెలిమి |
కానివారీతోను కావించు చెలిమి కట్టెవిరిచీ పొయిని పెట్టినట్లుండు. అయినవారీతోను కావించు చెలిమి, ఆకు మడచీ, మడత పెట్టినట్లుండు. కానివారీమాట కంట్లోది నలుసు, ప్రాణం పోయిందాక ప్రక్కలోపోటు; అయినవారీ మాట అమృతంపుతేట! బ్రతికి ఉన్నందాక భాగ్యంబుమూట! |