| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | తప్పుటడుగులు |

| తప్పుటడుగులు | ||
|
(ఏనుగు లక్ష్మణకవి పెద్దాపురపు రాజకుమారునిమీద చెప్పిన పాట.) పల్లవి: అప్పా రావోయీ! ఒప్పుల కుప్పా రావోయీ! తప్పూ టడుగూ లిడుచూనూ మా తండ్రీ రావోయీ! అనుపల్లవి: అంగీలోపలా నీ బొజ్జా, ఆకలి గొన్నాదీ బంగారూ నా తండ్రీ నీకూ, పాలూ పోసేనూ రంగూగా నే నెంతా పిలిచిన, రాకా జుణిగేవూ! బుంగా పట్టూకోనీ పెద్దా, బూచీ వచ్చేనూ! లాలా పోసూకో బాబయ్యా, చాలా ప్రొద్దాయే; తాలీ మీతో నీకూ వెనక, దాదూ వుంచేనూ! పాలూ బువ్వా తిని తొట్టేలో, పవ్వాళించితే లాలీ పాటాలాతో నిన్నూ, జోలా పాడేనూ! సరిపేషూ గట్టీ నిండూ ము, స్తాబూ చేసేను; అరుదూగా నీ చమరూ లోకీ, ఆడూకో బొమ్మీ! ఉరువైనా నీ సొగసూ చూచీ, ఉప్పాతించేరు; తిరుగాబోకు మీ స్వారీలో, దృష్టీ తాకేనీ! అప్పా రావోయీ! ఒప్పులకుప్పా రావోయీ! తప్పూ టడుగూ లిడుచూనూ మా తండ్రీ రావోయీ! | ||