| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 1.1. అవతారిక | ||
| క. |
శ్రీ వనితాసమ భూతన యా వక్షోజార్ద్రకుంకు - మాంకిత వక్షున్ బావనతర చారిత్రుని సేవించెదఁ జదలువాడ - శ్రీరఘురామున్. |
1 |
| సీ. |
శ్రీ వైష్ణవహితుండఁ, - జిక్కయభట్టరు శిష్యుఁడఁ, గవితావి - శేష శేష తులిత సర్వార్యు పౌ - త్రుండ, లక్ష్మయకుఁ దిమ్మాంబకు సుతుఁడఁ, బే - రనకు మాచ నకు రామకవివరు - నకు ననుజన్ముఁడ, నా రామకవి చెప్పి - నట్టి మహిత మత్స్య పురాణ వా - మనపురాణాది సత్కవితల కెల్ల లే - ఖకుఁడ వృద్ధ |
|
| గీ. |
కుండికాతీర లింగమ - గుంట నామ పట్టణస్థితికుండ సౌ - భాగ్య యుతుఁడ నాదిశాఖా ప్రవర్తన - నమరువాఁడఁ గాశ్యపగోత్రుఁడను దిమ్మ - కవిని నేను. |
2 |
| 1.2. ఛందోమహిమ | ||
| క. |
విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వంబు మఱి క - విత్వము ఛందో వేద్యము గావునఁ జెప్పెద హృద్యంబుగఁ గవిత చంద - మేర్పడఁ గృష్ణా! (అనంతుని ఛందము) |
3 |
| క. |
లక్షణ శాస్త్రములెల్లఁ బ రీక్షించుటఁ గొంత కొంత - యెఱిఁగిన వాఁడన్ లాక్షణి కానుగ్రహత సు లక్షణసారము రచింతు - లక్ష్యము లమరన్. |
4 |
| తే. |
కొంద ఱెంచెడు రీతులఁ - గొందఱెంచ రందఱును జెప్పినవి గొన్ని - యవియు నవియు దొరయఁగా గూర్చి కవి సమ్మ - తులను వ్రాయు దుక్త లక్ష్యాస్పదంబు లాం - ధ్రోక్తు లెనయ. |
5 |
| తే. |
గ్రంథ సామగ్రి గలుగుటఁ - బ్రతిపదమున కన్ని లక్షణములు వ్రాయు - దనిన నందు గ్రంథ విస్తరమగుఁ గానఁ - గవిత సూత్ర మెన్నిటను దేటపడు నన్ని - యే రచింతు. |
6 |