| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 5. యతి | ||
| 5.1. యతుల పర్యాయపదములు | ||
| క. |
విశ్రాంతి విరతి విశ్రమ విశ్రామ విరామ విరమ - విరమణములనన్ విశ్రుతమగు యతి కృతి నధి కశ్రావ్యంబై బెడంగు-గా నిడవలయున్. (భీమన ఛందము) |
89 |
| 5.2. | యతి నిర్వచనము | |
| క. |
విలసత్పాదాద్యక్షర ములు వళ్ళగు, నాద్వితీయ-ములు ప్రాసంబుల్; నెలకొని తమ తమ పాదం బుల యతిపై నన్నిపాద-ముల వళ్ళమరున్. (భీమన ఛందము) |
90 |
| 5.3. | యతి మైత్రి | |
| సీ. |
క్షాకును కఖగఘల్ - చఛజఝల్ శషసలు, అయహలకెల్లఁ గి-య్యలు ఘటించు\న్, గీర్తింపఁ గ్రారయు - గిలకయు రేఫకు, నావడి సెల్లును - నణలకెల్ల, మావడిసెల్లును - మాకునుం బాలకు, తావడిసెల్లును - తథదధలకు, పోలింప పుఫుబుభుల్ - మూలకు విలసిల్లు, లావడి సెల్లును - రళలకెల్లఁ, |
|
| తే. |
దలఁపఁ దలకట్ల కైత్వ మౌ-త్వమును దీర్ఘ మిత్వమేత్వంబు వట్రువ - లేకసరణిఁ గొమ్మునకుఁ జెల్లు నోత్వంబు - నిమ్ముగాను, యతుల కివి లక్షణములు ప-ద్మాయతాక్ష! |
91 |
| 5.4. | యతి భేదములు | |
| సీ. |
సరసంపు యతియును - సంయుక్తయతి, వర్గు, - గరిమదేశీయ, మె-క్కటియుఁ, బోల్కి, చక్కటియతి, యను - స్వరయతి, స్వరయతి, - యావడి, ఋవ్వడి - మావడియును, ప్రభు, విభాగములు, సౌ-భాగ్యంబు ప్రాసంబు, - భిన్నంబు, ప్రాది, య-భిన్నవిరతి, వెలయు నభేదంబు - వృద్ధి, నిత్యసమాస, - ప్లుతయతు, లాదేశ-యతి, వికల్ప, |
|
| తే. |
కాకువులు, రివ్వడియును, న-ఖండనిరతి, యుభయయతి, యశవర్గాదు - లొప్పు మెఱసి కృతుల ముప్పదియొక్కటి - యతులు దనరు సత్కవుల సమ్మతంబున - జలధిశయన! (లక్షణ చూడామణి) |
92 |
| 5.4.1. సరసయతి | ||
| ఆ. |
ణనలు చెల్లుఁ గమల-నాభ! యొండొంటికి అయహ లొనరఁజెల్లు - హస్తివరద! శషసలొందునండ్రు - చఛజఝంబులతోడ సరసయతులు నాఁగ - జలధిశయన! (అనంతుని ఛందము) |
93 |
| 5.4.2. సంయుక్తయతి | ||
| క. |
వెలయఁగ సంయుక్తాక్షర ములలో నెద్దానినైన - మునుకొని వడిగా నిలువందగుఁ బాదంబుల నలఘు గుణాన్వితుఁడ! రేచ - యసదృశదానా! (భీమన ఛందము) |
94 |
| క. |
ఒక్కడుగున విశ్రాంతులు పెక్కగుచో సంయుతములు - పెనుపన్ మును జ డ్డక్కరమునఁ దా నెత్తిన యక్కరమే యునుపవలయు - నన్నిటఁ గృష్ణా! (అనంతుని ఛందము) |
95 |
| 5.4.3. వర్గయతి | ||
| క. |
నిక్కువ మయ్యెన్ వర్గుల యక్కరమగు వళ్లు నడుప - నగు ఙఞణనమల్ దక్కఁబెఱ నాలుగింటికి దిక్కరి సన్నిభుఁడ! రేచ! - ధీజనవినుతా! (భీమన ఛందము) |
96 |
| 5.4.4. దేశీయయతి | ||
| తే. |
అచ్చుతోఁగూడి దేశీయ - మనెడి విరతి యెన్న నొక్కొక్కచోటఁ గ్రి-క్కిఱియుఁ గృతుల సరసలక్షణ కవులు గ్ర-చ్చఱ నొనర్ప భంజితాసురసముదాయ - యాంజనేయ! (చిత్రకవి పెద్దన - లక్షణసార సంగ్రహము) |
97 |
| 5.4.5. ఎక్కటియతి | ||
| క. |
ధరనెక్కటివళ్ళనఁదగు లరమఱవలు వానితోఁ దొ-లంగక లాకున్ సరిళాయని విశ్రమవే ళ రమాధిప! రెండునుం గ-లసి వర్తించున్. (అనంతుని ఛందము) |
98 |
| ఆ. |
మరునితండ్రి లోక-మహితుండు యాదవ రాజసింహమూర్తి - రక్షకుండు ఱాఁగవేలుపనఁగ - ఱంపిల్లు నెక్కటి వళ్ళునాఁగనిట్లు - వనజనాభ! (అనంతుని ఛందము) |
99 |
| 5.4.6. పోలికవడి | ||
| క. |
పోలు\న్ పు, ఫు, బు, భు, లకు మూ పోలికవడి శీలముల్ల -మున కెనయనఁగా శీలంబుల్లం బనగా భూలోకం బమరలోక-మున కెనయనఁగ\న్. (భీమన ఛందము) |
100 |
| క. |
చను నీవు హస్తినాపుర మున కేనును బాండు భూప - పుత్త్రులఁ బ్రీతి\న్ గని యిటువత్తు నవశ్యం బును వారలఁ జూడవలయుఁ - బోయెదననినన్. (భారతము - ఉద్యోగ) |
101 |
| 5.4.7. చక్కటియతి | ||
| క. |
అక్కజముగ పు ఫు బు భు లకు జక్కటియతియయ్యె శృంగ-సహిత మకారం బక్కమలజేశ్వరాదుల మ్రొక్కులుగైకొను సమస్త - భువనాధీశా! (అనంతుని ఛందము) |
102 |
| క. |
చిత్తమ్మున రంజిల్లుచు ముత్తైదువ లపుడు గదిసి - పూవిల్తునకున్ బిత్తరికిఁ బలు తెఱంగుల నెత్తిరి హారతులు పౌరులెల్లఁ - జెలంగన్. (పంచబాణ విలాసము) |
103 |
| 5.4.8. అనుస్వారయతి | ||
| క. |
పంచక వర్గాక్షరములు పంచమవర్ణములఁగూడి - పరఁగనటించున్ వంచింపక పెఱనాలుగు నంచితముగఁ బిఱుఁద సున్న-లంటినచోటన్. (భీమన ఛందము) |
104 |
| షట్పాదగీతి. |
ఙాకు వడిసెల్లు రత్న కం-కణమనంగ ఞాకు వడిసెల్లు బర్హిపిం-ఛంబనంగ ణాకు వడిసెల్లుఁ గనకమం-డపమనంగ నాకు వడిసెల్లు దివ్యగం-ధంబనంగ మాకు వడిసెల్లు విజితఁశం-బరుఁడనంగ బరఁగు నిబ్భంగిఁదగ నను-స్వార యతులు. (భీమన ఛందము) |
105 |
| 5.4.9. స్వరయతి | ||
| క. |
అ ఆ ఐ ఔ లకు మఱి ఇ ఈ లు ఋకారసహిత - మె ఏలకునౌ ఉ ఊ ల్దమలో నొడఁబడి ఒ ఓ లకు వళ్ళగు న్న-యోన్నత చరితా! (భీమన ఛందము) |
106 |
| 5.4.10. యావడి | ||
| తే. |
తాయెతును నుయ్యెలయుఁ బయ్యె-దయను దక్కఁ గలుగ దెత్వంబు మధ్య య-కారమునకుఁ దుదలఁ గ్రియలందు నెత్వంబు - గదియు, వాని కత్వమిడరాదు తెనుఁగున నబ్జనాభ! (కవిజన సంజీవని) |
107 |
| సీ. |
ఒక కాంతయొరఁగిన - సికమీఁది ముడిపువ్వు టెత్తులు మెఱయఁదా-యెతులుచుట్టి (చంద్రభాను చరిత్రము) |
108 |
| క. |
వలనొప్పగ నపుడా యు య్యెలలోపల బాలు నునిచి - యిందునిభాస్యల్ కలకంఠ నాదమాధురిఁ బలుమఱుఁ జెలరేఁగి జోలఁ - బాడిరి ప్రేమన్. (విక్రమార్క చరిత్ర) |
109 |
| సీ. |
వలఁబడ్డ జక్కవ-ల్వలె నున్న జిలుఁగుఁబ య్యెదలోని గుబ్బపా-లిండ్లు నెరయ. (యయాతి చరిత్ర) |
110 |
| 5.4.11. ఋవడి | ||
| తే. |
క్షితి ఋకారస్వరూపమై - యతులుపరఁగు ఋగ్యజుస్సామవినుతుండు - కృష్ణుఁడనఁగ వృష్ణికులజుండు కరుణాస-మృద్ధుఁ డనఁగ హేమపీతాంబరుఁడు దేవ - వృషభుఁడనఁగ. (అనంతుని ఛందము) |
111 |
| ఆ. |
ఋభులు సంతసిల్ల - గృతముఖ్యులరుదంద దితిజతతికి నెల్ల - ధృతిగలంగఁ దృణముమాడ్కి దాన - వేంద్రుని దునుమాడి జయమునొందు వేగ - జగదదీశ! (దశకుమార చరిత్రము) |
112 |
| 5.4.12. మావడి | ||
| తే. |
యరలవలు శషసహలును - నాదిబిందు యుతములై మకారవిరామ - యుక్తిఁ దనరు, మారుతాత్మజుఁ డరిది సం-యమి యనంగ మదన జనకుండు దనుజ సం-హరుఁడనంగ. (అనంతుని ఛందము) |
113 |
| క. |
కమలాప్తాంశులు బల వి క్రమవంతులు ఖడ్గధరులు - రాజులు మీరల్ మముఁ బ్రోవఁగఁదగదే సం యమి వర్యులఁ జూచిరా కు-మారకు లెల్లన్. (దశకుమార చరిత్రము) |
114 |
| చ. |
గరళపు ముద్దలోహ మవ - గాఢ మహాశని కోట్లుసమ్మెటల్ హరు నయనాగ్ని కొల్మి యుర - గాధిపు కోఱలు పట్టుకార్లు ది క్కరటి శిరంబు దాయ లయ - కాలుఁడు కమ్మరి వైరి వీర సం హరణ గుణాభిరాముఁ డగు - మైలమ భీమన ఖడ్గ సృష్టికిన్. (భీమకవి చాటుధార) |
115 |
| 5.4.13. ప్రభుయతి | ||
| తే. |
ఒనర నన్నమ్మ యనుచోట - నూఁదఁబడక ద్వివిధమగుఁ బ్రభునామాంత - విరమణంబు మహి నయోధ్యకు రాజు రా - మన యనంగ నతని పట్టపుదేవి సీ - తమ యనంగ. (అనంతుని ఛందము) |
116 |
| మ. |
ఘనుఁడన్ వేములవాడ వంశజుఁడ దా - క్షారామ భీమేశ నం దనుఁడన్ దివ్య విషామృత ప్రకట నా - నా కార్యధుర్యుండ భీ మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుం - గాధీశ! కస్తూరికా ఘనసారాది సుగంధ వస్తువుల వే - గందెచ్చి లాలింప రా. (భీమకవి చాటుధార) |
117 |
| 5.4.14. విభాగయతి | ||
| తే. |
సంఖ్యకుం బరిమాణ సం - జ్ఞకుఁ దనర్చు శబ్దములపై విభాగోక్తి - సరణి సంఘ టించినప్పుడు యతులు రెం - డేసి యగు ను పేంద్రుఁడిచ్చుధనము మోపెఁ - డేసి యనఁగ. (అనంతుని ఛందము) |
118 |
| క. |
ఆ సేనలఁ గని కినిసి మ హాసాయక వృష్టి ముంచి - యధికులపై నే డేసి పదేసి మఱియు నూ ఱేసి శరములు నిగిడించె - రిపుల దరంగన్. |
119 |
| 5.4.15. సౌభాగ్యయతి | ||
| తే. |
ఉభయములుసెల్లు యతులు రెం - డొక్క పదము నందు నెలకొన్న సౌభాగ్య - యతి సెలంగుఁ బ్రాంచితామర వినుత వే - దండ వరద నాకరిపుశిక్ష శౌరి య - నంత యనఁగ. (లక్షణ చూడామణి) |
120 |
| క. |
భండనమున నెదిరిన రిపు మండలముల నెల్లఁ గినిసి - మర్దించి మదో ద్దండుండై కవ్వడి మా ర్తాండసుతుం దొడరి పోరె - నాకులు మెచ్చన్. (భారతము) |
121 |
| 5.4.16. ప్రాసయతి | ||
| తే. |
పాకశాసన సుతుఁడు లో - కైక వీరుఁ డనఁగఁదగు బ్రాస విరతు లి - ట్లలరునేనిఁ జారుతరహాసకీర్తి ప్ర - చారుఁ డనఁగఁ బ్రాసయతిగాదు వర్గువు - పంకజాక్ష. (లక్షణ చూడామణి) |
122 |
| 5.4.17. భిన్నయతి | ||
| క. |
అంచిత తిలకము శౌరి ధ రించె ననఁగ జగణమధ్య - రేఫ విరతి యై యంచిత తిలకము హరి ధరి యించె ననఁగ భిన్నవడికి - నిత్యము వచ్చున్. (అనంతుని ఛందము) |
123 |
| 5.4.18. ప్రాదియతి | ||
| క. |
ప్రపరాపసమను సుప్ర త్యపి నిర్దు రధిన్యు పాభ్యు - దాజ్ వ్యత్యవ ప ర్యుపసర్గ దింశతికి వ ళ్లుపరిస్వరయుక్తమైన - నుభయము చెల్లు\న్. (భీమన ఛందము) |
124 |
| 5.4.19. అభిన్నయతి | ||
| క. |
ఇంచి యును నచ్చుహల్లు ను దంచితముగ సంధిఁ గూడు - నప్పు డభిన్నం బెంచఁగ బాలుఁడు హరిఁ బలి కించెననన్ రెండుఁ జెల్లు - నెలమిం గృతులన్. (లక్షణ చూడామణి) |
125 |
| క. |
మించి మదించిన రిపుల హ రించక సత్కీర్తి యీ మ - హీతల మెల్లన్ నించక దీనుల దయఁ బో షించక ప్రఖ్యాతి గల్గు - నే నరనాథా! (దశకుమార చరిత్రము) |
126 |
| క. |
భిన్నయతి జగణమధ్య మ భిన్నము దక్కిన గణాళిఁ - బెంపెనసినచోఁ భిన్నమున హల్లు చెల్లు న భిన్నమునకు రెండుఁ జెల్లు - బీభత్సనుతా! |
127 |
| క. |
పంచశరుండనఁగను జా లించిమహాప్రథన భూమి - నీక్షించి మదో దంచితుఁడై శంఖముఁ బూ రించెం గులఁగిరులు దిక్క - రివ్రజ మడఁగన్. (ప్రద్యుమ్నోపాఖ్యానము) |
128 |
| క. |
కాంచన చేలుని దమి నుతి యించె ననఁగ భిన్న విరతి - యే పారుఁ గృతిన్ గొంచక పోషించె న్విను తించె నన నభిన్న విరతి - యిటులు సెలంగున్. (లక్షణ చూడామణి) |
129 |
| 5.4.20. అభేదయతి | ||
| క. |
'వపయో రభేద' యనియెడు నెపమున పఫబభలు వాకు - నేర్పున వడిగా నుపమింపవచ్చుఁ గృతులం దుపనిషదుచితార్థ సూక్తు - లొలసిన చోటన్. |
130 |
| తే. |
లలిత వీణారవంబుతో - డక్కసరియె రమ్యమణిరాజరాజితో - లక్కసరియె భరిత భువనార్ణవంబుతో - వంక సరియె ననఁగను నభేద నామాఖ్య - యతులు సెలఁగు. |
131 |
| 5.4.21. వృద్ధియతి | ||
| క. |
ఏకైకము సోదన నా కౌకసులను శబ్దములకు - నచ్చటి వడిగా ఐకారౌకారంబులు గైకొనఁ జను వృద్ధివళ్లు - కవు లొడఁబడఁగన్. (కావ్యాలంకార చూడామణి) |
132 |
| శా. |
నీ కంఠార్పిత కాలపాశము శిరో - నిర్ఘాతపాతంబు లం లౌక స్సంచయ కాలరాత్రి గళ బ - ద్ధోదగ్ర కాలాహి క న్యా కారాగత మృత్యువున్ జనక క - న్యన్ వేగ నొప్పించి లో కైక త్రాణుని రామునిం గనుము నీ - కీ బుద్ధి గాకుండినన్. (భాస్కర రామాయణము) |
133 |
| 5.4.22. నిత్యసమాసయతి | ||
| తే. |
పదము విభజించి చెప్పఁ జొ - ప్పడని యదియు నన్య శబ్దంబుఁ గొని విగ్ర-హంబుఁ జెప్పు నదియు నిత్యసమాసమై - యతులఁ గృతుల నంటి సంధిని నచ్చు హ - ల్లైన విరతి. (అనంతుని ఛందము) |
134 |
| క. |
శ్రీ కంఠుఁ డెదురునపుడు వ నౌకోధ్వజ మింద్ర మకుట - మర్జున తురగా నీకము దివ్యశతాంగము నా కవ్వడి కబ్బియున్న - నతఁడే మనునో. (అధర్వణ భారత విరాతపర్వము) |
135 |
| 5.4.23. ప్లుతయతి | ||
| క. |
ప్లుత మనఁ బరఁగుఁ ద్రి మాత్రా న్విత వర్ణము దానిమీఁది - విదిత స్వరముల్ కృతి నయ్యక్షరములు చనుఁ జతురానన సదృశ వళ్ళు - చక్కటి కెల్లన్. (భీమన ఛందము) |
136 |
| క. |
దూరాహ్వానమునందు మ హారోదన గాన సంశ - యార్థముల తుదిన్ జేరువనగు నాద్యచ్చుల నారూఢిం బ్లుతము వడి మ - హత్వము మెఱయన్. (భీమన ఛందము) |
137 |
| 5.4.24. ఆదేశయతి | ||
| క. |
ద్వీపమునకు నాకమునకు నాపై శాస్త్రోక్తి నచ్చు - లా దేశ సమా సాపత్తి గలుగుటయు వళు లాపాదింపుదురు గొంద - ఱచ్చును హల్లున్. (కావ్యాలంకార చూడామణి) |
138 |
| ఉ. |
ద్వీపుల ద్రుంచి విశ్వ జగ - తీ ధరుఁ డు త్తమమైన జాంబవ ద్వీపమునందు గోవులకు - నిమ్ముగఁ జేయుటయుం బ్రసిద్ధమై గోపతి ధేను వవ్విభున - కున్ ధనమిచ్చిన నిచ్చెఁగాక యే భూపతు లివ్వదాన్యగుణ - బుద్ధిఁ బ్రసిద్ధి వహించి రుర్వరన్. (కావ్యాలంకార చూడామణి) |
139 |
| క. |
నీ కరవాల నిహతులై నాకంబున కేఁగి రాజ - నారాయణ! యో భూకాంతు లెంత చలమో నాకవిటోత్తములఁ దూల - నాడుదు రెలమిన్. (కావ్యాలంకార చూడామణి) |
140 |
| ఉ. |
ఓ కమలాక్ష! వింటివె సు - యోధనుతోఁ గురుసేన లెల్ల జీ కాకు పడంగ ధర్మజుఁడు - కౌతుకమందఁగ నీవు మెచ్చఁగా నాకవిభుండు లేఖతతి - యచ్చెరుపాటున నన్నెచూడ నే నే కమలాప్త పుత్త్రు వధి - యించెదఁ గార్యము నిర్వహించెదన్. (భారతము) |
141 |
| 5.4.25. వికల్పయతి | ||
| తే. |
హయుత వర్గువులు వికల్ప - యతులఁ జెల్లు దేవకీ నందనుఁడు జగ - ద్ధితుఁ డనంగ హలధరుఁడు సంగరాంగణో - ద్ధతుఁ డనంగ నవని మోచినయవి కకు - బ్భస్తు లగఁగ. (అనంతుని ఛందము) |
142 |
| క. |
నుతకీర్తివడసి సుజన ప ణితులై వర్ధిల్ల దుష్ట - నిగ్రహ శిష్ట ప్రతిపాలకులై త్రిజగ ద్ధితముగ నేలంగఁ గదు మ - హీతల మెల్లన్. (దశకుమార చరిత్రము) |
143 |
| 5.4.26. కాకువడి | ||
| తే. |
వరుస దీర్ఘాంతసంబుద్ధి - వచన యతుల కమరుఁ గృతులందుఁ గాకుస్వ - రము సహస్ర నామ శోభిత గోప కృ - ష్ణా యనంగ నమరవందిత గోప కృ - ష్ణా యనంగ. (అనంతుని ఛందము) |
144 |
| క. |
కాకుస్వర యతులగు నితఁ డే కదలక జలధిఁ బవ్వ - ళించె ననఁగ, బ్ర శ్నాకలిత దీర్ఘమగు నితఁ డే కవ్వడి రథముఁ గడపె - నిమ్ములననఁగ\న్. (అనంతుని ఛందము) |
145 |
| 5.4.27. రివడి | ||
| క. |
విలసదృకారమ్మును మఱి రిలవి విరమ మొందు శౌరి - ఋషులకు శశ్వ త్సులభుఁ డనఁగ ఈ ఏలకుఁ దలఁపఁగ రీతోడి విరతి - దలకొన దెందున్. (అనంతుని ఛందము) |
146 |
| 5.4.28. అఖండయతి | ||
| ఉ. |
మానుగ విశ్రమాక్షర స - మన్వితమై సర్వమూఁదినం దదీ యాను గుణాక్షరంబె కొని - యైనను జెప్పఁగవచ్చు నీ క్రియన్ భాను సహస్రిభాసి వృష - భాధిపుఁ డన్నటు లర్థయుక్తమై పూనినచో నఖండయతి - పొల్పగు నాది కవి ప్రణీతమై. (భీమన ఛందము) |
147 |
| ఉ. |
అన్నపు తండ్రి యట్ల విను - మంతియకాదట మీఁద రాజ వే మన్నఁ గొఱంత లేదు మణి - మండన ముఖ్యము లైన కానుకల్ మున్నుగ సీత నిచ్చి జన - లోకపతిం గని నన్నుఁ బ్రోవు మీ సన్నపుఁ గార్యము ల్వలదు - సందియమే లటుగాక తక్కినన్. (భాస్కర రామాయణము) |
148 |
| క. |
పూనుకొని యక్ష శబ్దము పై నూహిని శబ్దమున్నఁ - బటు వృద్ధి యగు\న్ మానుగ గుణముం జెల్లును దాన నఖండంబు స్వరము - దనరున్ గృతులన్. |
149 |
| ఆ. |
లక్షణాన్వితముగ - నక్ష శబ్దంబుపైఁ దనర నూహినను ప - దంబు వెలయు నపుడు వృద్ధిసెప్ప - నగు గుణంబును జెల్లు నాగుణం బఖండ - మై చెలంగు. (కవిజన సంజీవని) |
150 |
| 5.4.29. ఉభయయతి | ||
| ఆ. |
యుష్మ దస్మ దనెడు - నుభయంబునకుఁ బొల్చు నచ్చు గూడి ద్వివిధ - మయ్యె విరతి తరమె కృష్ణ యుష్మ - దవతారకథనంబు లభినుతింప నస్మ - దాదులకును. |
151 |
| 5.4.30. యవర్గయతి - 5.4.31. శవర్గయతి | ||
| క. |
య శ వర్గ ద్వయమునకును విశదము దమ యక్షరములు - వెలయఁగ వళ్ళౌఁ గుశలమగు పదము ధరలో శశి నౌదలఁ దాల్చు నతఁడు - హరుఁ డను మాడ్కిన్. |
152 |
| 5.4.32. జ్ఞావడి | ||
| గీ. |
అప్రసిద్ధము ఙ ఞ లు శ - బ్దాదియందు ఞా ఙ సంయుక్తి తద్భవ - వ్యాజమునను నణలతోఁ బొందు విరతి యా - జ్ఞప్తి యనఁగ జలరుహాక్షా శ్రితులును సు - జ్ఞానులనఁగ. (అనంతుని ఛందము) |
153 |
| ఆ. |
యజ్ఞమునకు జన్న - మాజ్ఞప్తి కానతి యాజ్ఞ కానసంజ్ఞ - కరయ సన్న విన్నపంబునగును - విజ్ఞాపనమునకు జ్ఞాకుఁ దద్భవంబు - నా ధరిత్రి. (అనంతుని ఛందము) |
154 |
| ఉ. |
శ్రీలలనా తనూభవ వి - శేష జగన్మయమూల మన్మథా జ్ఞాలతికాలవాల రతి - నాథ కరాళ మదాంధ గంధ శుం డాల విలోల తద్భుజక - సత్కరవాల విశాల శుభ్రవా తూల మదీయకాంత ధృతి - దూలఁగ నేపున వీవకుండుమీ. |
155 |
| 5.4.33. సరసస్వరయతి | ||
| క. |
ఇరుగడల హల్లునొందిన నొరపుగ నొకచోటఁ బొంది - యున్నను స్వరమౌ విరసముగ నచ్చులున్నన్ సరస విరామం బటండ్రు - జలరుహనాభా! |
156 |
| గీ. |
ప్రాదినిత్య సమాస శ - బ్దములు గాక పెఱ పదంబులపై నచ్చు - బెరసినప్పు డన్నియును స్వరయతులగు - సాంబగురుఁడ యింద్రుఁ డమరాన్వయాబ్ధిపూ - ర్ణేందుఁ డనఁగ. (అనంతుని ఛందము) |
157 |
| 5.4.34. లుప్తవిసర్గకస్వరయతి | ||
| తే. |
స్వరము తుదనుండి లుప వి - సర్గకోత్వ మైన స్వరవిరామంబు దా - సోఽహ మనఁగ నచ్యుతాశ్రితు లుర్వి న - న్యోన్యమిత్రు లన ముకుందుండు విమల య - శోఽర్థి యనఁగ. (అనంతుని ఛందము) |
158 |
| 5.4.35. నిత్యయతి | ||
| ఆ. |
ఏని యనుపదంబు - తో నాదివిధమంది సంధి నిత్యయతుల - జరుగుచుండు నెట్టి క్రూర కర్ముఁ - డేని సద్గతి నొందు నిన్ను నాత్మఁ దలఁచె - నేని కృష్ణ. (అనంతుని ఛందము) |
159 |
| 5.4.36. అనునాసికవికల్పయతి | ||
| గీ. |
నలిఁ గకార హిల్లిత రాను - నాసికాఖ్యఁ గదిసి తత్పంచమముగా వి - కల్పవిరతి గలుగుఁ జక్రివల్లవ సుదృ - ఙ్మథుఁ డనంగఁ గమల నేత్రుండు సకల ది - ఙ్మహితుఁ డనఁగ. |
160 |
| క. |
మగతనముఁ జూపఁజాలక మగఁటిమి చెడి విఱిగి పాఱు - మన సైన్యములో జగదక్షుఁడు రుచిచేఁ బ్రా ఙ్నగమున వెలుంగొందు రీతిఁ - గవ్వడి పొలిచెన్. |
161 |
| 5.4.37. ఌకారయతి | ||
| తే. |
మును ఋకార మీ ఏలతో - నొనరి నట్లు చేర దొకట యణాదేశ - కారణమున ఘన లకారంబ యగును ఌ - కార విరతి కౢప్తిలేదు శౌరి గుణావ - ళికి ననంగ. (అనంతుని ఛందము) |
162 |
| 5.4.38. పరరూపయతి | ||
| తే. |
స్వాంత వేదండ మార్తండ - శబ్దములకు యతులు నుభయంబులగు బుధ - స్వాంతములకు నతి సుఖావహుఁ డెపుడు వే - దండవరదు డనఁగ హరి దైత్యతిమిర మా - ర్తండుఁ డనఁగ. (కవిజన సంజీవని) |
163 |
| 5.4.39. ఱావడి | ||
| క. |
ధారుణి ఱావడి యనఁదగు ఱా రేఫకు రేఫ ఱాకు - రహి వడిఁ దనరున్ నీరమ్యకీర్తి నగుఁ దా రారాజన్ నలువబలుగు - ఱాలుననంగన్. |
164 |
| క. |
తెంపును బెంపును గదుర ని లింపులు వెఱఁగంది చూడ - రిపుసైన్యము లుం గంపింపఁ దనబలంబులు ఱంపిలి బిట్టార్వ సింధు - రాజుం దాఁకెన్. (భారతము) |
165 |