| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 6. ప్రాసములు | ||
| క. |
స్వరనియతి లేదు ప్రాసకు నరయఁగ నేయక్షరమున - కా యక్షర మే పరువడి నిలుచును నాలుగు చరణంబులఁ గృతులయందు - సమ్యక్ఫణితిన్. |
166 |
| 6.1. షడ్విధ ప్రాసములు | ||
| క. |
భాసురములగుచు సుకర ప్రాసాను ప్రాస దుష్క - ర ప్రాసాంత్య ప్రాస ద్విప్రాస త్రి ప్రాసము లన షడ్విధములు - ప్రాసము లుర్విన్. (భీమన ఛందము) |
167 |
| 6.1.1. సుకరప్రాసము | ||
| క. |
పరమోపకార! ధరణీ సురవర సురభూజ! సుగుణ - సుందర! తరుణీ స్మరనిభ! సుకరప్రాస మ మరఁ జెప్పంగఁ గృతులఁ జెల్లు - మల్లియరేచా! (భీమన ఛందము) |
168 |
| 6.1.2. అనుప్రాసము | ||
| క. |
విప్రప్రకరముని ప్రీ తిప్రద! సుప్రభవ! యప్ర - తిమదోఃప్రభవా! విప్రణుతి! సుప్రసన్న! య ను ప్రాసప్రవణ మిది మ - నుప్రియ చరితా! (అనంతుని ఛందము) |
169 |
| 6.1.3. దుష్కరప్రాసము | ||
| క. |
దోః కీలత మణికటక! యు రః కలిత రమాభిరామ! - రాజిత సుగుణాం తః కరణ! ఖండితారి శి రః కందుక! యనిన దుష్క - ర ప్రాసమగున్. (అనంతుని ఛందము) |
170 |
| 6.1.4. అంత్యప్రాసము | ||
| క. |
అగణితవిభవస్ఫూర్తీ! నిగమాగమ సతత వినుత - నిర్మలమూర్తీ! జగదభి రక్షణవర్తీ! యగు నంత్య ప్రాస మిట్లు - దంచితకీర్తీ! (అనంతుని ఛందము) |
171 |
| 6.1.5. ద్విప్రాసము | ||
| క. |
కంజనయన! భవభీతి వి భంజన! శుక శౌనకాది - బహుముని చేతో రంజన! ద్వంద్వప్రాసమ నంజను నిప్పాటఁ బల్కి - నం గృతులందున్. (అనంతుని ఛందము) |
172 |
| 6.1.6. త్రిప్రాసము | ||
| క. |
తా నవనీత ప్రియుఁడన దానవ నిర్మూలనైక - తత్పరుఁడన స న్మౌని వినుతుఁడని నతసుర ధేనువనఁగ గృతులయందుఁ - ద్విప్రాసయగున్. (అనంతుని ఛందము) |
173 |