| భాష | ఛందస్సు | సులక్షణసారము |
| 9. గణ సంయోగములు | ||
| 9.1. మగణ సంయోగము | ||
| క. |
మగణంబు పద్య ముఖమున నగణితముగఁ గూర్చి చెప్ప - నగుఁ గృతియొండెన్ దగఁ బద్యమొండెఁ గర్తకు నగణితముగ నొసఁగు నాయు - రైశ్వర్యంబుల్. (భీమన ఛందము) |
219 |
| క. |
జగతికి గణముల కెల్లను మగణము గారణము గాన - మగణము గదియన్ నిగిడించిన గణ మెల్లను దగ శుభ మొనరించుఁ గీడు - దగులదు దానన్. (కావ్యచింతామణి) |
220 |
| క. |
మించిన పరుసము లోహముఁ గాంచనముగఁ జేయునట్టి - కైవడి గణముల్ మంచివి గానివి యైనను మంచివియై వెలయుఁ జేయు - మగణము పతికిన్. |
221 |
| క. |
మగణముతోఁ బద్యాదిని మగణము గదిసినను ధరణి - మండల మెల్లన్ బొగడొంద నేలుఁ గృతిపతి సగణము గదిసినను గీర్తి - జగముల వెలయున్. |
222 |
| క. |
మించులు గిరికొనుముత్యము గాంచనముం గదిసినట్టి - గతి నల యగణం బంచితముగఁ దనుఁగదిసిన మంచిదియై లక్ష్మినొసఁగు - మగణము పతికిన్. |
223 |
| క. |
ముందట నిల్పిన మగణము క్రిందన్ జగణంబుగదియఁ - గీలించిన మే లొందున్ సగణం బటువలెఁ బొందించిన విభుఁడు రిపులఁ - బోర జయించున్. |
224 |
| క. |
మగణం బెప్పుడు శుభకర మగు నైననుఁ గ్రూరగణము - నది డాసినచోఁ దెగి చంపు బుధుఁడు క్రూరుం డగు గ్రహముం గదిసి క్రూరుఁ - డై చనుమాడ్కిన్. (భీమన ఛందము) |
225 |
| 9.2. యగణ సంయోగము | ||
| క. |
శంకింపక యగణముతోఁ బంకజహితగణము గదియఁ - బద్యము జెప్పన్ బొంకముసెడి విభుఁ డొరులకుఁ గింకరుఁడైఁ దిక్కులేక - గీడ్పడి యుండున్. |
226 |
| 9.3. రగణ సంయోగము | ||
| క. |
పొగడొందఁ బద్య ముఖమున రగణము యగణంబుఁ గూడి - రాజిల్లినచో జగమంతయు నేలెడి వాఁ డగుఁ గృతిపతి విభవయుక్తుఁ - డగుఁ గవివరుఁడున్. (భీమన ఛందము) |
227 |
| క. |
ఇంగల రగణము జగణము సంగడమున నొండెఁ దగణ - సంగతి నొండెన్ మంగళకరమని పద్యము ముంగల జెప్పుదురు సుకవి - ముఖ్యులు గృతులన్. |
228 |
| క. |
అన లానిల సంయోగం బనుపమ కీలా కరాళ - మగు వహ్నిభయం బొనరించుఁ గర్తృగృహమున కనుమానము లేదు దీన - నండ్రు కవీంద్రుల్. (అధర్వణుని ఛందము) |
229 |
| క. |
రగణంబును సగణంబును జగణముఁ బద్యాది నిల్పఁ - జన దెవ్వరికిన్ దగదనక యనియె నిల్పిన మిగులం బతి కవయుఁ జెడుగు - మేదిని లోనన్. |
230 |
| 9.4. సగణ సంయోగము | ||
| క. |
మునుకొని పద్య ముఖంబున ననిలగణం బిడిన నాయు - రారోగ్యములున్ గొనసాగు, దానిముందట ననలగణం బిడినఁ బతికి - నలజడి సేయున్. (భీమన ఛందము) |
231 |
| క. |
మారుతగణంబు సంప త్కారణమగు జతగణములఁ - గదిసినచో నా మారుతగణంబు జతగా నా రవిగణమున్నఁ బతికి - నలమటవచ్చున్. |
232 |
| క. |
మారుతగణంబు జత నం గారపుగణమున్నఁ బతి మృ - గంబుల చేతన్ జోరులచే శత్రులచే ధారుణిఁ జెడు మందిరంబు - దరికొని కాలున్. |
233 |
| 9.5. తగణ సంయోగము | ||
| క. |
తగణంబున కధిదైవము గగనం బది శూన్యమగుచుఁ - గాదని పలుకన్ దగ, దది మిక్కిలి మంచిది గగనం బొగి నిత్య విభవుఁ - గాఁ జేయు నిలన్. (కావ్య చింతామణి) |
234 |
| క. |
ఆది తగణ మొప్పు - నది దేవతా గణం బరసి చూడ దాని - కమరగురుఁడు గ్రహము గానఁ బద్య - గద్య ముఖంబుల మంచిదనుచు భీము - డెంచినాఁడు. |
235 |
| క. |
అగణిత పద సంపత్కర మగుఁ దగణము దానిపజ్జ - నమరిన గణముల్ వెగటుగుణంబులు మానుఁ జె లఁగుచు\న్ సౌఖ్యంబు లొసఁగు - లలిత చరిత్రా. |
236 |
| క. |
తగణంబు దొలఁతఁ బిమ్మట భగణంబును గదియనిల్పి - పద్యము హృద్యం బుగ రచియించిన కర్తకు నగణితముగ నొసఁగు నాయు - రైశ్వర్యంబుల్. (భీమన ఛందము) |
237 |
| క. |
మొగివాత తగణముండిన వగవక యగణంబు దాని - వద్దనె నిలుపన్ దెగి తన్నుఁ జంపఁ దలఁచిన పగవారికైనఁ దగదు - పద్యముఁ జెప్పన్. |
238 |
| క. |
ఆరోగ్యకరుఁడు భాస్కరుఁ డారయ జగణమున కొడయఁ - డది మొగి నిడఁగా నేరోగముపైకొన దా చేరువ చుట్టంపుగణముఁ - జేకొనఁ జాలు\న్. |
239 |
| 9.6. జగణ సంయోగము | ||
| క. |
అవివేకులు జగణంబును భువి రోగము సేయుననుచుఁ - బోనాడుదు రీ కవివరులు\న్ శబ్దార్థము వివరింపరు రుక్కు దీప్తి - విదితముగాఁగన్. (కావ్యచింతామణి) |
240 |
| క. |
తగణంబుఁ గదిసి చంపును రగణముతోఁ గదిసి ఘోర - రణ మొనరించు\న్ భగణ మిఁక నొక విచిత్రము మగణముతోఁ గూడఁ గాల - మానము పతికి\న్. |
241 |
| క. |
రాజులకు జగణరగణము లోజం గీలించి సుకవి - యొసఁగిన పద్యం బాజిని జయమీఁ జాలును దేజీ లేనుఁగులు భటులుఁ - దేరులు నేలా! |
242 |
| 9.7. భగణ సంయోగము | ||
| క. |
భగణంబు సకల శుభములఁ బొకడొందగఁ జేయు దానిఁ - బొందిన గణముల్ మిగుల శుభంబుల నొసఁగును యగణంబు సువర్ణకారి - యగుఁ బద్యాదిన్. |
243 |
| 9.8. నగణ సంయోగము | ||
| గీ. |
పర్వతములందు మేరువు - భాతియగుచు సర్వసురులందు శంకరు - సామ్యమగుచు నరయ మృగములయందు సిం - హంబుకరణి గణములందెల్ల నగణంబు - గరిమఁగాంచు. (అధర్వణుని ఛందము) |
244 |
| క. |
ఏగణము గదియు నగణం బాగణము సమస్త మంగ - ళావాప్తంబై రాగిల్లు నినుము పరుసపు యోగంబునఁ బసిఁడివన్నె - నూనిన భంగిన్. (భీమన ఛందము) |
245 |
| 9.9. గణ సంయోగ ప్రభావము | ||
| క. |
చందనతరు సంగతి పిచు మందంబులు పరిమళించు - మాడ్కి నమందా నందకరమైన గణముల పొందున దుష్టగుణవర్ణ - ములు ప్రియమిచ్చు\న్. (ఉత్తమగండచ్ఛందము) |
246 |
| గీ. |
పరుసవేదితోడఁ - బెరసినలోహంబు జాతరూపమైన - చందంబున సారమైన గణము - సంగతిఁ దనకీడు మాని దుష్టగణము - మంచి దగును. |
247 |
| 9.10. గణ సంయోగ విశేషములు | ||
| క. |
రసలం జెప్పినఁ జిచ్చగు జసలం జెప్పినను దెవులు - చయ్యనవచ్చు\న్ తసలం జెప్పిన మేలగు మసలం జెప్పినను గర్త - మండలమేలు\న్. (భీమన ఛందము) |
248 |
| క. |
సయలం జెప్పిన శుభమగు జయల\న్ జెప్పినను బతికి - జయకీర్తులగున్ రయల\న్ జెప్పిన నెంతయుఁ బ్రియమగు మఱిమయలఁ జెప్పఁ - బెంపొనరించు\న్. |
249 |
| క. |
సభలం జెప్పిన విభవము రభలం జెప్పినను జెట్ట - రయమున వచ్చున్ శుభమగు మయలం జెప్పిన నుభయము వర్తిల్లునందు - రుత్తమచరితా. (భీమన ఛందము) |
250 |
| ఆ. |
సగణమగణములు పొ - సంగిన విభవంబు రసగణంబు లెనయఁ - బ్రబలుఁ గీడు రగణ యగణయుతము - రాజ్యప్రదంబగు భయము లిరువురకును - భయము లిడును. (కవిసర్పగారుడము) |
251 |
| క. |
యగణముతో యగణంబును జగణముతో జగణములును - సగణముతోడన్ సగణంబును రగణముతో రగణంబును గూర్చి చెప్ప - రాదయ్యెడలన్ |
252 |
| 9.11. నక్షత్ర గుణదోషములు | ||
| క. |
కమలహితుఁడున్న నక్ష త్రము మొదలుగ నేడు దోష - తమములు నడుమన్ ప్రమదప్రదములు పండ్రెం డమరఁగ నశుభములు తొమ్మి - దగుఁ బద్యాదిన్. (కవిగజాంకుశము) |
253 |
| 9.12. జీవ నిర్జీవ నక్షత్రములు - తత్ఫలములు | ||
| క. |
విదితముగ రాహుభుక్తిని నొదవిన పదమూఁడు జీవ - యుక్తములం దు న్నది యావల నెరితారలు పదునాలుగు మృతములనఁగఁ - బడు నెల్లెడలన్. (శ్రీధరచ్ఛందము) |
254 |
| క. |
పతి మృతుఁడగుఁ బద్యాదిని మృత నక్షత్రంబు నిడిన - మేదురసౌఖ్యా న్వితుఁడగు నమృతములన న ప్రతిమములగు తారకములఁ - బద్యాది నిడన్. (కవిగజాంకుశము) |
255 |
| క. |
మొదలనె జీవగణం బిడఁ గొదలేక కృతీశుబ్రదుకు - గొనసాగు మదిన్ వెదకక నిర్జీవగణం బదికిన నపుడా కృతీశు - కాయువు దఱుఁగున్. |
256 |
| 9.13. దగ్ధజ్వలిత ధూమిత నక్షత్రములు | ||
| క. |
క్రూర గ్రహ ముక్తములగు తారలు దగ్ధములు, ధూమి - తంబులు వానిన్ జేరి యెదురెదుర నున్నవి క్రూర గతంబులని యెఱిఁగి - కొను జ్వలితంబుల్. (గోకర్ణ చ్ఛందము) |
257 |
| ఆ. |
ధనముఁ గోలుపుచ్చు - దగ్ధనక్షత్రంబు చావుచేటుఁదెచ్చు - జ్వలిత తార ధూమితంబు మారి - తునిజేయు నెప్పుడు గాన మొదల నిల్పఁ - గాదు వీని. (అధర్వణుని చ్ఛందము) |
258 |
| క. |
కృతి మొదల దగ్ధతారయుఁ బతి సతి దుఃఖితుని జేయుఁ - బ్రజ్వలితంబున్ మృతిఁ బొందించును మఱి ధూ మిత నక్షత్రంబు నతని - మే నలయించున్. |
259 |
| క. |
పతితారకు సంబంధ స్థితితారకుఁ జెల్లు కీడు - చింతింపక దు ర్మతిఁ గవిత చెప్పఁ దివిరెడు నతఁడె సుమీ కవిపిశాచ - మారయ నుర్విన్. |
260 |
| 9.14. గణ గ్రహ మైత్రి | ||
| క. |
మగణాది గణంబులకును బగయును మైత్రియు నెఱుఁగఁ - బడు సుకవులకున్ జగమునఁ దత్తద్గ్రహముల పగయును మైత్రియును శాస్త్ర - పద్ధతిఁగనఁగాన్. |
261 |
| 9.15. శుభ పాప గ్రహములు | ||
| ఉ. |
వారిజమిత్త్రసూనుఁడును - వారిజమిత్త్రుఁడు భూమి పుత్త్రుడున్ గ్రూరులు; వారిఁ జేరునెడఁ - గ్రూరుఁడు చంద్రతనూభవుండు; బృం దారక రాజమంత్రియును - దైత్యగురుండును సౌమ్యుఁడ వ్విధుం డారయఁ గృష్ణపక్ష తిథు - లందు శుభప్రదు లెన్ని చూడఁగన్. |
262 |
| క. |
తొలుత గణగ్రహమైత్త్రులు దలఁపఁ ద్రికోణాధిపతులు - తత్తద్గ్రహ రా సుల గణము వారణమ్మునఁ గలసిన చుట్టంబులవియె - గ్రహగణమైత్త్రుల్. |
263 |
| ఆ. |
ఏ యవస్థనుండి - యే వేళనే గ్రహ మే శుభాశుభంబు - లిచ్చుచుండు నా యవస్థనుండి - యా వేళ నా గణ మా శుభాశుభంబు - లందఁజేయు. |
264 |
| ఆ. |
గ్రహము పొత్తుకలిమి - గల గణసంగతి నుండి క్రూరగ్రహము - నొందు శుభము గ్రహము పొత్తులేని - గణముతోఁ బద్యాదిఁ గూడి మంచిగణము - కీడు సేయు. |
265 |
| 9.16. గ్రహముల ఛాయలు | ||
| ఆ. |
శుక్రశశులు తెలుపు - శోణిత వర్ణులు తరణికుజులు బుధుఁడు - సురగురుండు పసిఁడి వన్నెవారు - భానుజరాహులు సలిల జలధరంబు - ఛాయవారు. |
266 |
| చ. |
ఉడుపతి యేగ్రహంబుకడ - నున్నను దానును వాని వన్నెయున్ నడుమను నా శుభంబుగ గ - ణంబుల లోపలనే గణంబుసం గడి భగణంబు నిల్పు నధి - కంబుగ నాఫల మిచ్చు నవ్విధుం దొడయడు గాన దానికిని - యుక్తమ యండ్రు కుయుక్తులేటికిన్. |
267 |
| ఆ. |
శ్వేత చంద్రుఁడయిన - సేమంబుఁ గావించు రక్తచంద్రుఁడయిన - రణమొనర్చుఁ గృష్ణచంద్రుఁడయిన - గ్రూరత లొడఁగూర్చు బీతచంద్రుఁడయినఁ - బ్రీతినిచ్చు. |
268 |
| 9.17. కృతి రచనకుఁ బ్రశస్త వారములు | ||
| క. |
శుక్ర గురు బుధవారముల్ - సొంపు సేయు సోమవారంబు సంపదల్ - సొరిది నిచ్చు శనియు మంగళవారముల్ - చావుదెచ్చు భానువారంబు సంగరం - బమరఁ జేయు. |
269 |
| క. |
తలపోసి గద్యపద్యా దుల నక్షరగణములకును - దొరఁకొని మైత్రుల్ గలుగఁగఁ జెప్పిన హస్తా మలకముగాఁ దగుఫలంబు - మహి నిర్వురకున్. |
270 |
| క. |
పొందెఱిఁగి యానుకూల్యము నొందంగాఁ గూర్చి తగఁ బ్ర - యోగించి కృతుల్ సందర్భించు గణాక్షర బృందం బిరువురకుఁ జాలఁ - బ్రీతియొనర్చున్. |
271 |
| క. |
శ్రీసర్వజ్ఞాంచితరస నా సంవాసిత విశేష - నామ బహువిధా వాస! సులక్షణసారం బా సో మార్కముగ నిల్పు - మననిసుతేశా! |
272 |
| మ. |
కరుణాబంధుర! కామదాయి! - కితవఘ్నా! కీశసేవ్యా! కుభృ ద్వర! కూలంకష కీర్తి! కేవల! - కృతార్థా! కైకసీపుత్త్ర రా జ్వరమాస్థాపక కోటిసూర్యనిభ! - కౌసల్యాత్మజా! కంబుకం ధర! కర్ణాంత విశాలనేత్ర! రఘునాథా! భక్తచింతామణీ! |
273 |