| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 01. ఊడ్పుల ప్రారంభం |
|
గనపతయ్య గనపతయ్య ఉండ్రాళ్ళూ నీకుపోతురా ఓ గనపతయ్య మందకొడిగ వుండబోకురా... గనపతయ్య గనపతయ్య జమ్మిపత్రిపూజసేతురా ఓ గనపతయ్య ముందెనీకు పూజసేతురా... గనపతయ్య గనపతయ్య మనసునిండు పూజసేతురా ఓ గనపతయ్య మమ్ము ఎపుడు మరువబోకురా... గనపతయ్య గనపతయ్య ఊరిలోన ఊరేగించెదా ఓ గనపతయ్య ఉయ్యాలల ఊపుతానురా... గనపతయ్య గనపతయ్య ఉండ్రాళ్ళూ నీకు పోతురా ఓ గనపతయ్య మమ్ము ఎపుడు మరువబోకురా... |