| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 02. పిల్లతో సరసాలు |
|
కూలికొత్తావంటె పిల్లామరీ... కూలంటె కులాస అయ్యా మాకూ... నేతకొత్తావంటె పిల్లా మరి... నేతంటె నేటేను అయ్యా మాకూ... ఊడ్పు కొత్తావంటె పిల్లా మరి... ఊడ్పంటె ఊగులాట అయ్యా మాకూ... పత్ర కొడతావంటె పిల్లా మరి... పత్రంటె వళ్లుమంట అయ్యా మాకూ... కోతకొత్తావంటె పిల్లా మరి... కోతంటె కోలాటం అయ్యా మాకూ... |