| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 05. ఓ చిన్నదాన |
|
గుంటూరు చిన్నదాన గుబురూ కేశాలదాన గుబురూ కేశాలమీద గొబ్బి పూలు సోకే ॥ఓచి॥ పువ్వాడ చిన్నదాన పువ్వూల జడలదాన పువ్వూల జడలమీద మనసెంత నీకే ॥ఓచి॥ రంగాము పోయి నేను రంగైన రైక తెస్తే రంగైన రైక మీద మనసేల లేదే ॥ఓచి॥ |