| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 07. మాఁవ |
|
ఎళ్ళొస్తానోయ్ మాఁవ మళ్లొస్తాను మళ్లొస్తానోయ్ మాఁవ ఎళ్లొస్తాను కళ్లు తెరిసె తలికి కళ్లెదుట వుంటాను వళ్లు యిరిసే తలికి ఒళ్లోన వుంటాను సుళ్లు తిరిగొస్తాను గళ్లు కదిలొస్తాను ॥ఎళ్లొ॥ సక్కని తురాయిక్రిందా చుక్కలాంటి రాయీమీదా ముక్కుతూ మూలుగుతూ ముడుచుకొని తొంగేవు మురిసినా తలిచినా ముంగలే వుంటాను ॥ఎళ్లొ॥ |