| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 08. ఎల్లారే |
|
ఎల్లారే నల్లామాను అంతరాల పడవమీద ఎల్లారే నల్లమాను అందీపువ్వులు కొయ్యబోతే ఎల్లారే నల్లమాను కొమ్మ తగిలీ కొప్పునిండే ఎల్లారే నల్లమానూ కొప్పూలోనా పువ్వూలన్ని ఎల్లారే నల్లమానూ గొప్పగాను గుబురూ నిండె ఎల్లారే నల్లమానూ గుబురూ కొప్పు పువ్వుల్లోన ఎల్లారే నల్లామాను రాలిపువ్వు రంగమెల్లె ఎల్లారే నల్లమానూ రంగమంత భంగపుచ్చె ఎల్లారే నల్లమానూ |