| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 09. కోరికలు |
|
మనయింటి యెనకాల దానిమ్మ చెట్టో దానిమ్మ చెట్టున్నాది నాయు డప్పన్నో దానిమ్మ పండే తినాలి తింటేను దానిమ్మ పండే తినాలి కంటేను తొలుచూలు కొడుకును కనాలి కొడుకును కనాలి... మనయింటి యెనకాల బత్తాయి చెట్టో బత్తాయి చెట్టున్నాది నాయుడప్పన్నో బత్తాయి పండు తినాలి తింటేను బత్తాయి పండు తినాలి కంటేను తొలుచూలు కొడుకును కనాలి కొడుకును కనాలి... |