| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 11. ఓలోలే |
|
ఓలోలే - ఓలోలె పిల్లా నీవూ? గోంగూర కోయగలవ పిల్లా నీవూ? గోంగూర కోయలేను అయ్యా నేనూ గోళ్ళన్ని కందుతాయి అయ్యా నాకూ. ధాన్యమైన దంచగలవ పిల్లా నీవూ? ధాన్యమంటె దగ్గొస్త దయ్యా మాకు. ఏకులైన వడకగలవ పిల్లా నీవూ? ఏకులంటె యేడుపొస్త దయ్యా మాకు, ఎల్లైన వెయ్యగలవ పిల్లా నీవూ? ఎల్లంటె ఏటోను అయ్యా మాకు. చాపైన యెయ్యగలవ పిల్లా నీవూ? చాపంటె చక్కెడత అయ్యా నేనూ. సంతకైన ఎల్ల గలవ పిల్లా నీవు? సంతంటె సంతోష మయ్యా నాకు. |