| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 12. పిల్ల పాట |
|
కాటుకెట్టిందిరా పిల్ల చూడమని ఏలో డొముకులాడి... కమలా బెట్టింద్రా పిల్ల చూడమని... కాసులేసింద్రా పిల్ల చూడమని... తలకాయదువ్వింద్రా పిల్ల చూడమని... లోలకులెట్టింద్రా పిల్ల చూడమని... బేసరెట్టింద్రా పిల్ల చూడమని... గాజులేసింద్రా పిల్ల చూడమని... పట్టాలెట్టింద్రా పిల్ల చూడమని... చరుపుచరిచింద్రా పిల్ల చూడమని... |