| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 13. ఏల పాట |
|
సూర్యచంద్ర వహ్ని నడుమా శౌర్యమానే చిలుకగంటీ సూర్యదీప్తి గాయుచుండాగా - యేగంటి లింగా చూడజూడాశ్చర్యమాయెరా. కాంతాలపాలెములోన చింతమానూ పుట్టెగదరా చింత అనలూ కొనలు సాగానా - యేగంటి లింగా చింతపూసీ పండుపండేరా. కానరాని యడవిలోన వానలేని మడుగునిండె వానలేని మడుగుమీదానూ - యేగంటి లింగా మానరానీ అగ్ని పొడమేరా. ఆకులేని యడవిలోన తోకలేని మృగము పుట్టె తోకలేని మృగము కడుపునా - యేగంటి లింగా ఈకలేని పక్షి బుట్టెరా. |