| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 15. సువ్వి పాట |
|
సువ్వి సువ్వీ సువ్వానీ సుదములు దంచెదరో - లాల వనితల మనసులు కుందెనచేసిటు వలపులు తగనించో - ఓ లాల కనుసన్నలనెడి రోకండ్లానూ కన్నెలు దంచెదరో - లాల బంగరు చెరగుల పట్టుపుట్టములు కంగులు దూలగ నో - లాల అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెదరో - లాల కురులుదూలగ మంచి - చన్నూలపై సరులు దూలాడంగనో - లాల అరవిరిబాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెదరో - లాల ఘల్లుఘల్లుమని కంకణ రవములు పల్లవ పాణులకో - లాల అల్లన నడుములు అలసియాడ సతు లొల్లన దంచెదరో - లాల కప్పురగంధులు కమ్మని పువ్వుల చప్పరంబులనే - ఓలాల తెప్పలుగారని దేలుచు గోనే టప్పని బాడెదరో - లాల. |