| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 16. పడవ సరంగు పాట |
|
నేలను నమ్మి ఏలేలో చెట్టూ వున్నది హైలేస చెట్టును నమ్మి ఏలేలో కొమ్మా వున్నది హైలేసా కొమ్మను నమ్మి ఏలేలో రెమ్మా వున్నది హైలేసా రెమ్మను నమ్మి ఏలేలో అమ్మి వున్నది హైలేసా అమ్మిని నమ్మి ఏలేలో పువ్వు వున్నది హైలేసా పువ్వును నమ్మి ఏలేలో పిందే వున్నది హైలేసా పిందెను నమ్మి ఏలేలో కాయా వున్నది హైలేసా కాయను నమ్మి ఏలేలో పండు వున్నది హైలేసా పండును నమ్మి ఏలేలో నేనున్నాను హైలేసా నన్ను నమ్మి ఏలేలో నువ్వున్నావు హైలేసా. |