| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 17. చిన్నదాన |
|
గూడూరు చిన్నదాన గూడూరు గుట్టాలదాన గూడూరు గుట్టాలమీద గాజులుంటే సోకే... ॥ఓచి॥ నీలి నీలాటి దాన నిలువు సన్నాటి దాన నీలి నీలాము మీద నగలుంటే సోకే... ॥ఓచి॥ సన్న సన్నాని దాన సన్నాని కురులా దాన సన్నాని కురులా మీద జాజి గుత్తి సోకే... ॥ఓచి॥ |