| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 20. యేలేయల్లో |
|
యేలేయల్లో యేలేయల్లో యేలేయల్లా... ॥యే॥ తోటామధ్యా యిల్లూచూడూ తోటచుట్టూ చెట్లూచూడూ ఇంటిదానీ కంటపడకా ఇంటిలోనీ పిల్లని చూడూ పిల్లాసిగలో పూలూ చూడూ పిల్లాదానీ సోకూ చూడూ సోకూ సూసి జాతి సూసి జాతి సూసి, నీతీ సూసి జాలిగానే దాన్ని చూడూ చూరువార దాన్నిచూడు తీరుగానే దానీచేరి కొప్పులోని పూలాతోటి తిప్పులాడీ పిల్లాతోటీ ఆడరా నీ కందినంత ఆడదాన్నీ పొందినంత... |