| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 22. ఓ నల్లదాన |
|
అంచూన నల్లజీర అచ్చాము తెల్లతీర అందూన శీతాఫలమే ఓ నల్లదాన అందూ నా మనసే ఓ నల్లదానా గొప్పాగ నిన్నుచేరి నీటూగ యాత్ర కెడితె నీతీకి భంగమాయెనే ఓ నల్లదాన నిన్నూనే విడువాబోనే ఓ నల్లదానా చెంపాను కమ్మల జంట చేతూల గాజుల జంట నీముందు సోకులెందుకే ఓ నల్లదానా నాయందు పరాకెందుకే ఓ నల్లదానా |