| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 23. పడవ పాట |
|
నీటిని నమ్మి ఏలేలో నేలున్నదీ హైలేసా నేలను నమ్మీ ఏలేలో పంటావున్నది హైలేసా పంటను నమ్మీ ఏలేలో ప్రజలుండారూ హైలేసా ప్రజలాకోసం ఏలేలో పంటున్నాదీ హైలేసా పంటను నమ్మీ ఏలేలో కాపున్నాడూ హైలేసా కాపును నమ్మీ ఏలేలో రాజ్యం ఉండది హైలేసా రాజ్యాన్ని నమ్మీ ఏలేలో రాజుండాడూ హైలేసా రాజ్యంలోనా ఏలేలో నువ్వున్నావు హైలేసా నిన్నూనమ్మీ ఏలేలో నేనున్నానూ హైలేసా మనలను నమ్మీ ఏలేలో పడవుండాది హైలేసా పడవను నమ్మీ ఏలేలో బ్రతుకుండాదీ హైలేసా హైలేసో... హైలేసో... |