| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 24. కోరికలు |
|
పండ్లాతో నిండీన పచ్చని గంప పడతులకు కోరిక దింపండి గంప పచ్చగా పండినా పనస ఫలాలు పడతులకు మనసాయె పంచండి తొనలు దోరగా వేగినా మొక్కజొన్నల్లు దోసిలతో పంచండి పడతులందరికి పండ్లతో నిండినా మా మనసునిండు పండంటి పాపడూ కావాలిమాకు పడతులకు కోరిక దింపండి గంప పండ్లాతో నిండీన పచ్చని గంప. |