| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 25. విభూతి పండు |
|
వేసుకొన్నా చంద్రహారము వేసుకొమ్మని తానిచ్చేనమ్మా వేసి తెల్లవారి చూడబోతే కాశిలో రుద్రాక్షలాయెనటమ్మా రాతిరొచ్చిన సాంబశివునీ నమ్మరాదె అవునే ఓయమ్మా... పూసుకొన్నా పునుగు జవ్వాజి పూసుకొమ్మని తావచ్చేనమ్మా... పూసితెల్లవారి చూడబోతే కాశిలో విభూతి పండాయనటమ్మా... రాతిరొచ్చిన సాంబశివుడూ ఎంతకయినా మాయలవాడూ... |