| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 26. లాలి పాట |
|
లాలి శ్రీ జనలోల లీలా వినోదా లాలి ద్వారకపురి బాల గోపాలా... తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వేసి నాలుగూ వేదములు గొలుసులమరించీ బలువైన ఫణిరాజు పాన్పులమరించీ చిత్తమనియేటి దూలములు వేసి... అందముగ జాంబవతి చందనము పుయ్య పొందుగా కాళింది పూవులందియ్యా మందయానయు రాధ మనపు లందియ్యా ఇందుముఖి లక్ష్మణా వింజామరెయ్యా... చుట్టగోప స్త్రీలు తొట్టె నూచంగా కోట రంగారాజు కోర్కె లొసగంగా... |