| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 27. తలుపు దగ్గర పాట |
|
శివభక్తులకే దయగలవాడను శివుడందురు నా పేరూ - సాంబ శివుడందురు నా పేరూ శివనామంబులు సకలెందుల జెల్లును చేరికతో వుండవోయీ - శివ చేరికతో వుండవోయీ వడిగిన లందిన కుంతన లొసగెటి ఉరపతి దరుడనె గౌరీ - నే ఉరపతి దరుడనె గౌరీ ఉరపతి దరుడవైతే యెలాయెను వదలు కడకు పోవోయీ - శివ వదలు కడకు పోవోయీ బలాన రాముడు బలసతి నడిగిన బలిదుండుడనే గౌరీ - నే బలిదుండుడనే గౌరీ బలిదుండుడవైతే యేలాయెను భక్తులిళ్ళకు పోవోయీ - శివ భక్తులిళ్ళకు పోవోయీ కొమరుగ గంగని జటలో నించుకు కొమర జంగాన్నే గౌరీ - నే కొమర జంగాన్నే గౌరీ కొమర జంగమైతేమాయెను కొమరులిండ్లకు పోవోయీ - శివ కొమరులిండ్లకు పోవోయీ కాశీ లోపల యేక్షము లొసగెటి గంగాధరుడనె గౌరీ - నే గంగాధరుడనె గౌరీ వాశికి యోలాగైతిరిగే మీరు వార్నాశివై యుండవోయీ - శివ వార్నాశివై యుండవోయీ |