| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 33. చందమామా |
|
నా వెన్ను దన్నూకో నాడూజన్మించీనా చందమామా నా నగధారూలతో నా మనవి దెల్పావే చందమామా నిన్న నీ పొత్తూన తిన్నన్నమే కాని చందమామా నా కన్నూల నే నన్న నన్యమేరుగనయ్య చందమామా పాలా సంద్రుని యింట పుట్టినామూ మనము చందమామా ఇంత పగతూడవై నన్ను బాధింపుటది యేమొ చందమామా |