Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 1 : ఎల్లోరా
34. దంపు పదం
కోడలా కోడలా
పచ్చిపాల మీద
మీగడేదే?
వేడిపాలా మీద
వెన్న లేదే? ॥కో॥
అత్త నువుబెట్టి
ఆరేళ్ళుగాని
పచ్చిపాలామీద
మీగ డుంటుందా?
వేడిపాలామీద
వెన్న వుంటుందా? ॥అత్త॥
AndhraBharati AMdhra bhArati - daMpu padaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )