| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 54. పడవ పాట |
|
లాగరోరీ లంగరు తాడూ హైలేసో హవ్వారి హవ్వ... రేమిరా మా యన్నాలారా... అందమయినా తమ్ములార... బుంగలేరే దున్నూవాడా... ముద్దులా మేనత్తాకొడకా... రేమిరా మా బావాగారూ... నూతిచుట్టూ తిరుగువాడా... నూతిలో పుల్లేసువాడా... పుల్లసోకూ నాకూ తెలుసూ... ఒల్లకాదూ మల్లీపోరా... అందమయినా శూరూలారా... అందమయినా తమ్ములారా... లాగరోరీ లంగరు తాడూ... హైలేసో హవ్వారి హవ్వ... హై... లే... సో... |