| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 75. రోడ్డుబంటా పాట |
|
ఓ అన్నలార తమ్ములార ఓ యందమైన శూరులార పట్టండీ పట్టండీ జాన ఓ పట్టనోడి నోటి లోన పచ్చిమిరప పాలు పొయ్య ఓ దిబ్బమీదా దీప మెట్టి దేముడానీ మొక్కబోతే దయ్యమాయి తరుమ బోయె ఓ పలకండ్ర పలకండ్ర జాన ఓ మడత మేనీ చిరుత కఱ్ఱ చిరుత కఱ్ఱ కంచు మ్రోగు కనుము మ్రోగు కట్టగాదూ మూరు డన్న జాన కొకటి బార కొకటి ఆ పట్టండి పట్టండి జాన... |