| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 80. మల్లిపొద |
|
మల్లెపొదనూ యింట పెంచుకోవాలీ మల్లెపూలూ సిగలో ముడుచు కోవాలీ మల్లె పొదమాటూన మాటిచ్చినాను. మల్లి వస్తానని చెయ్యేసినాను మాట తప్పితె మల్లి కోపగిస్తాది మరచావులే మాట నెక్కిరిస్తాది. మల్లి పొదమాటూన మాటలా మధ్యా మల్లి వస్తాననీ మాటిచ్చినాను. మాటతప్పీ నేను మల్లిచేరకపోతే మాటతప్పావనీ మాటలంటుంది మల్లి. మల్లి పొదమాటునా మనసిప్పుకోని మనసులో యేటోను దాచుకున్నాము. కళ్ళలో గుజ్జన్న లాటలాడాము కలలలో యేటోను కన్నాముమేము. |