| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 79. చుక్కాని పాట |
|
ఓ రేడి కొయ్య ఓడ మీదా ఓ రేడి కొయ్యా ఓడ మీదా... చూడ చక్కని చిన్నా దొచ్చి ఉంగరాలా చెయ్యీ చూసె ఉండదయ్యా పిల్లా మనసు చూడ చక్కని చిన్నా దయ్యా ఓ రేడి కొయ్యా ఓడా మీదా... ఓ అన్నలారా తమ్మూలారా పలక నోడి నోటిలోనా పనికి మానీ పాలూ పొయ్యా చూడ చక్కని చిన్నా దయ్యా ఓ రేడి కొయ్యా ఓడా మీదా... ఓ అన్నలారా శూరూలారా పలికి నోళ్లా నోటిలోనా పనసదారా పాలూ పొయ్యా చూడ చక్కని చిన్నా దయ్యా ఓ రేడి కొయ్యా ఓడా మీదా... |