| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 78. రోడ్డుబంటా పాట |
|
అరిజెల్ల బేలి మోత నల్లనేలల దున్నా దలచెరా... దేముడనెరా మొక్కబోతే దయ్యమాయీ పట్టినాదిరా... మానయంబా గాలిమోతా గాలిమోతా దీవీ మోతరా... రేమిరన్నా ఉసారులేదు రాగిడబ్బు యీడూముంతరా... మిద్దె మీదా మిరప చెట్టూ బొట్టు పెట్టీ బొమ్మా చూడరా... నీలు లేవూ పాలు లేవూ రంగు చూసీ కాయా కోయరా... కూకున్నాదీ కుర్రగుంటా మేతిరోడుర దానెంపాటెల్లెరా.. కుంచమంత గుడిసెలోనూ మానికంత రోలు తోసేరా.. అరిజెల్ల బేరిమోత నల్లనేలల దున్నదలచారా... |