| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 77. సువ్వి పాట |
|
సువ్వి కస్తూరిరంగ సువ్వి కావేటిరంగ సువ్వి రామాభిరామ సువ్వి లాలీ ఆ సువ్వి - ఆ సువ్వి... తుమ్మకర్ర రోలుదోసి తూముడొడ్లు వాయవేసి దంచుదామా బియ్యం దంచుదామా ఆ సువ్వి - ఆ సువ్వి... ఒక్కవేలు చుక్క బొట్టు అందరికీ చాలదమ్మ దంచుదామా బియ్యం చెలియలందరు ఆ సువ్వి - ఆ సువ్వి... ఒకరి ఒకరి కొప్పులోన గుప్పెడేసి మల్లెమొగ్గలు మగువకాంత కొప్పులోన మల్లె జాజులు ఆ సువ్వి - ఆ సువ్వి... |