| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 85. సాలుదున్ను |
|
సాలు దున్ను సాలు దున్ను ఓ బావా సాలాడి నేతకాదు ఓ బావా. విత్తులయిన జల్ల గలవ ఓ బావా. వీరత్వం చూపించు ఓ బావా. మోటైన కట్ట గలవ ఓ బావా. నిమ్మళ్లు నిండుతాయి ఓ బావా. కోతలన్ని వచ్చినాయి ఓ బావా. కోరినట్టి రైకలియ్యి ఓ బావా. రాసుల్లు పోశావ ఓ బావా. గాదుల్లు కట్టావ ఓ బావా. రాసులయిన నింపావ ఓ బావా. కాసులయిన కడ్తావ ఓ బావా. |