| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 88. ఓ చిన్నదానా |
|
రంగు రంగూలదానా రంగైన చిన్నదానా రంగాము పోయినేను చిన్నదాన రంగైన రయిక తెస్తా చిన్నదానా... బంగారు మురుగువాడా బుఱ్ఱ మీసాలవాడా రంగము నీవు పోతే చిన్నవాడా నాగతి ఏమిటంటా చిన్నవాడా... అంగూల జుట్టుదానా పువ్వూలా కుచ్చుదానా రంగాము నీవువస్తే చిన్నదానా రంగము భంగమౌనే చిన్నదానా... బంగారు మురుగువాడా పనసా బుగ్గలవాడా రంగైన నామీద చిన్నవాడా మనసేల లేదురా చిన్నవాడా... సరి అయితే నాతో రాయె సరస కూచుంటారాయె రంగంలో సోకుగాను చిన్నదానా రంగల్లె వుండాలె చిన్నదానా... నీ పక్క నేనే వుంటే మనమాట ఒకటే అయితే సోకూకు లోటు యేటి చిన్నవాడా సారసాలె - కాదువోయ్ చిన్నవాడా... |