| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 89. అప్పగింతలు |
|
ఎల్లొస్తావా బావ ఎళ్లొస్తావా... ఎల్లొస్తావా బావ ఎగిరొస్తావా? ఏనాడు పిలచీన ఎందూకు పిలచీన ఎగిరొస్తానే పిల్ల ఎళ్లొస్తానే ఎళ్లొస్తానే పిల్ల ఎగిరొస్తానే. ఎళ్లిపోతూ నీవు యేటోను సెప్పావు ఎగిరొస్తావా బావ తిరిగొస్తావా? తిరిగొస్తావా బావ ఎళ్ళొస్తావా? ఆ - అంటె అడవులు కో - అంటె కోనలు దాటొస్తానే పిల్ల ఎగిరొస్తానే ఎగిరొస్తానే పిల్ల ఎళ్లొస్తానే. అడవులు కోనలు వరదాలు - పరదాలు దాటొస్తావా బావ ఎగిరొస్తావా? ఎగిరొస్తావా బావ మళ్లొస్తావా? |