| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 91. ప్రశ్నలు |
|
నల్ల నల్లానీ దానా నల్లనీ కోకాలా దానా ఎందుబోయీ నావు చెప్పావే నీ వెందుబోయీనావు చెప్పావే. చిలపీ చూపులూ చూస్తూ చెంగున గంతులూ వేస్తు ఎందు బోయీనావు చెప్పావే. నీ వెందుబోయీ నావూ చెప్పావే. పిల్లానీవూ నన్నూ విడిచీ పరుగులూ గంతూలూ వేసే ఎందుబోయీ నావు చెప్పావే నీ వెందుబోయీ నావు చెప్పావే. |