| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 92. రోడ్డు రోలరు పాట |
|
ఓయల్లారే బేలియల్ల లాగండీ లాగండి బాబు యల్లారే బేలియల్ల రోలా కాదు బరువూ రోల లాగనోడీ బుద్ధీకాదు లాగినోడే దేముడయ్య కదలదూ కదలందీ జాన రోల కాదూ చిన్నదయ్యా మూరెడూ జానెడూ లేదు సిగ్గులేదూ దుక్క జనము రోసమూ మీసమూ లేదు ఓ యల్లారే బేలియల్ల ఓ యల్లారే బేలియల్ల |