| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 93. అర్థరాత్రికాడ |
|
అద్ద రాతిరి కాడ అదురు బెదురూ లేక అరుగు మీ దుండావు ఓ పిల్లా అదురు లేదా నీకు ఓ పిల్లా... అద్ద రాతిరి కాడ అరుగు మీదుంటేను అడుగు లేతావేటి చిన్నోడా బెదురు లేదానీకు బుల్లోడా... ఈ యేల యీ చోట ఇంతరాతిరి కాడ ఏటి చేతుండావే ఓ పిల్లా సోకుగా నుండావె ఓ పిల్లా... ఇంత రాతిరి యేల ఈడ నీకేటి పని ఎగురుతుండావు లే బుల్లోడా పనియేటో సెప్పెళ్ళు పిల్లోడా... చల్లన్ని యెన్నెలా చక్కగా వున్నాది చూరు ప్రక్కగ నాతో ఓ పిల్లా చేరవస్తావోలె ఓ పిల్లా... చల్లన్ని మాటలూ చక్కగా సెప్పావు దూరాన నావోడు బుల్లోడా తొందరగ వస్తాడు పిల్లోడా... అయితే నే పోతుండ అసలు మాటేటంట అదురు లేకను చెప్పు ఓ పిల్లా అదురుగా వుండాది ఓ పిల్లా... చుక్కాని యేలకీ చల్లమ్మ వస్తాను చల్లంగ పొమ్మురా పిల్లోడా సరసోళ్ళు చూస్తారు బుల్లోడా... |