| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 94. చుక్కలచొక్కా |
|
చక్కానీ పిల్లా వాడా చుక్కాల చొక్కా వాడా చల్లమ్మ నాతో వస్తే ఓ పిల్లావాడా చక్కాగ ఉంటాదిరోయ్ ఓ పిల్లవాడా... నీలాల కళ్ళదానా నీలాపు చీరదానా నిక్కంగ నాతోవుంటే నీకేమి లోటే ఓ చిన్నదానా నీకేమి లోటే ఓ చిన్నదానా... చల్లమ్మ వెడుతూ వుంటే చుక్కాల చొక్కాయేసి చల్లగ నీతో రానే ఓ చిన్నదానా సరసాలు ఆడా రానే ఓ చిన్నదానా... చుక్కలచొక్కా వాడా చుంచు మీసాలవాడా దారులంట రాకురోయ్ ఓ చిన్నవాడా నా యన్న చూస్తాడు ఓ చిన్న వాడా... |