| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
005. ఓయన్నిదాయలాల
| ఓయన్ని దాయలాల గొబ్బియాలాలో | ... ఓ |
|
కుంటా పూవాసనకు రాయుడు రాంగా కుసుమ పూ వాసనకు కుంట దారెల్లె ఓయన్ని దాయలాల గొబ్బియాలాలో | ... ఓ |
|
కుంటాము గదికి రాయుడు రాంగా మల్లె పూవాసనకు మారు దారెల్లె ఓయన్ని దాయలాల గొబ్బియాలాలో | ... ఓ |
|
చెరువు ముంగిటికి రాయుడు రాంగా సెనిగ పూవాసనకు చెరువు దారెల్లె ఓయన్ని దాయలాల గొబ్బియాలాలో | ... ఓ |
|
బాయి ముంగటికి రాయుడు రాంగా బంతి పూవాసనకు బాయి దారెల్లె ఓయన్ని దాయలాల గొబ్బియాలాలో | ... ఓ |
| ఈ కూలిజనము వలెనే ఏమూలనో పుట్టి పరిమళించేవే సెనగపూలూ, బంతిపూలూ, ఎక్కడో ఒక తుప్పలో మల్లెపూవులున్నూ. రాయుడికి ఎక్కడికి పోయినా పూల సౌరభమే. |
| వీరి బ్రతుకు బాటల తిన్నదనము 'కామందు'ల సిరిసంపదల మీదనే ఆధారపడుతుంది. వారి పాడి పంటలూ, పిల్లపాపలూ, ఆవుగోవులూ చల్లగా వుండవలె. కూలిజనమే కదా రైతుల కులపురోహితులు. |