| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
006. రాయినా శందనాలు
| రాయినా శందనాలో ఓయి బావల్లాల బావన్నిలాల | ... బావ |
| రామలచ్చన్లాటి రాజూలులేరు సీతమ్మలాటి యిల్లాలు లేదు పాడిపంటలు సల్లగుండాల మా కూలిరైతుల కడుపునిండాల మా కాఁవందులు సల్లగుండాల దండిగ మా సేలుపండాలి | ... రామ |
| ఉత్తారవచ్చే ఎత్తారగంప కారుమేఘా లాకాశంబునిండె తొలకర్లో వరసాలు కురవాలి ఎకరానికి బత్తాలు పండాలి | ... రామ |
| నీరుపెట్టి దుక్కుదున్నాలి బాబు దుక్కుదున్ని మొక్కనాటాలి బాబు మా రయితుబాబులు బాగుండాలి ఆరిపిల్లపాప సల్లగుండాలి ఆరి ఆవుల్ని గోవుల్ని మేముకాయాలి కాసినందుకు మాకు నూకలియ్యాలి పల్లెటూళ్ళు బాగుండాలి పట్నాలు కడుపూలు నిండాలి సిన్నపెద్దలు కలిసుండాలి ఏవూరుకావూరు ఎంతో బాగుండాల | ... రామ |
| పైరుకంకుల పైని పిల్లపిట్టలు వాలె ఇల్లాగ రానువ్వు పిల్లోడ కొట్టకుండా నువ్వు తిట్టకుండా నువ్వు అందర్ని బెదిరిస్తె అవతలకు పోవురా | ... రామ |
| పాపము తమవలెనె బ్రతుకుతెరువుకు పొలాలమీద ఆధారపడతాయి పిల్లపిట్టలు. కొట్టకుండా బెదిరిస్తే అవతలకు - మరో పొలానికి పోతాయిట. అందమైన సజాతీయాభిమానము! కాదంటారా? |