| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
007. నాట్లు నాటుతూ
| గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి గట్టు రాయని ఇంట్లో పుట్టె గౌరమ్మ పుట్టుటే గౌరమ్మ ఏమేమి గోరు కుట్టూ వయ్యారి రవికె, కుంకుమాకాయ జాలవయ్యారి రవికె, జామాలపేరు వంకా చక్కటికుడుక వజ్రాలపేరు నీచేతి కంకణము ఏదే శ్రీగౌరు ఆడబోయినకాడ ఏడబోయినదో |
| కల్పన పొలాన్ని దాటి గౌరమ్మను మలచింది. గౌరమ్మ రత్నాలగట్టు రాయని గాదిలిబిడ్డ. కంకణము జారుటను గుర్తించు నవసరమామెకేల? తల్లి అయినా కూతురు చేతి కంకణము 'ఏది?' అనే అడిగినది. "ఆడబోయిన కాడ ఏడబోయినదో" నట! ఈ వాతాయనములో గట్టురాయని సిరికొండయై గోచరించగలదు. |