| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
035. కదురు
| ఈ కదురుపాట పల్లెల వారి ఆర్థిక జీవనానికి చక్కని అద్దము. స్త్రీ యొక్క ఆర్థిక పారతంత్ర్యమే మగవాని జులుమునకు మద్దత్తు. 'కదురు చల్లగుంటే' తగని మగడెందుకూ? |
|
వడుకు వడుకూ కదుర వడకవే కదురా ఏకుల్ల బుట్టంత యెల్లుండి సంత ఏకేకు ఒకబార యెల్లుండి సంత నాయేకులైపోయె నాకేమొ చింత యేకుల్ల యెల్లక్క పత్తి పుల్లక్క రాటాల రామక్క రావె పోదాము ... వడుకు కదురు సల్లంగుంటె కదిలింతు గోల్కొండ మగడెందుకే తగని మగడెందుకే |