| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
036. రాట్నము
| దంపుళ్ళ పాట వరుసలో తరువోజల్లాగ వినపడే ఈ పాటలన్నీ లోకవృత్తానికి దర్పణాలే. ఊహలూ, ఉద్దేశాలు, భావాలూ అల్లుకుని వుంటాయి వీట్లో. కవ్వమాడని ఇల్లు, కదురు తిప్పని కొంప కానరాని ఆ రోజుల కుదురైన సంతుష్టిని ఈ పాటలు చక్కగా బింబిస్తాయి. |
|
అందచందము లేని ఆడకూతురికి అందమేరు పరచు ఆ పత్తిచెట్టు పాడిపంటలున్న బంగారమిచ్చు పైడి పత్తిని పెంచ బంగారు హెచ్చు పాలు పెరుగులున్న పాపల కొఱకు పత్తి నూలుదీయ పాతల కొఱకు కవ్వమాడని యిల్లు కదురు తిప్పని కొంప మగ్గము లేనూరు మరి గానరాదు రాట్నాల మ్రోతమ్మ రవ్వలా మోత కనకగిరి గొల్లోరి కవ్వాల మోత ఏకుళ్ళ రాట్నము కాళ్ళ సంకెళ్ళు కలవారి అల్లుడి కాళ్ళ సంకెళ్ళు ఏకేకు ఒక బార యెల్లుండి సంత నాయేకులయిపోయె నాకేమి చింత పుంజమ్ము నూలుకు పోగు తక్కువ కొండమీద పొద్దుంది కొట్టబోకత్త చేనివారొస్తారు చెప్ప బోకత్త |
| తక్కువైన పోగుని భర్తీ చేయుటకని చేనిలో పత్తిని తస్కరించినది కాబోలు! |