| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
118. చెంచు
| నాయుడు కన్నా గడుసువాడీ యువకుడు. ఇక్కడి విలాసములు చాలక రంగము పోతున్నాడు. పలికే మాటలు మాత్రము ఇవి. |
| మళ్ళీ వచ్చిందాక మర్లూ మరవనంటా శేతులో శెయ్యేసి శెప్పోలె చెంచూ | జోర్శెయ్ |
| కూడొండి పెడతాను గుడ్డుతికి పెడతాను కూడా తోడకపోవా జోడుగా మావా? నీ మణుచు నా మణుచిరకూ దప్పాకుంటే యెడబాసి నెలవుంటె నేమోలె శెంచూ | జోర్శెయ్ |
| ఏ వూర నేపల్లె దేనిమీ కన్నేశినవో యెంటా నన్రానీవు తుంటారి మామా | జోర్శెయ్ |
| కోకా జరీ తెస్తా కొప్పూ బిళ్ళా తెస్తా నవ్వూతా శెలవిచ్చి నన్నంపే శెంచు | జోర్శెయ్ |
| కోకా జరీ వొద్దు కొప్పూ బిళ్ళా వొద్దు రానీవా నీతోటి కానీవో మామా | జోర్శెయ్ |
| శెంపా ముద్దెట్టుకొని శెల్లో బాయ్ యేడవకు అల్లాడే సారంగు యెల్లీపో శెంచు | జోర్శెయ్ |