| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
162. ఒంటి బ్రతుకు
| అంచి యామనికొండ పక్కనా పెనుగొండ పైదళము రాకుండ పారింది జండా ఒంటిగ నేనుండలేనో చందమామా ఒక్కదానీ కోనలో ఏనూరు ఏతాలు ఇన్నూరు కాలువలు ఎంత చక్కనిదయ్య ఈ పూల వనమూ ॥ఒంటి॥ మంచినీళ్ళా బావి మనపెరటనుంచుకొని ఉప్పునీళ్ళకు బోవ ఉపకారమేమో ॥ఒంటి॥ మల్లెపూలా తోట మనపెరట పెట్టుకుని చీకిపూలకు బోవ సింగారమేమో ॥ఒంటి॥ దవణమేసిన రాజు కల్ల నాటకపోయె కావిలుండకపోయె ఎనలేని దవనంబు ఏటిపాలాయె ఒంటిగ నేనుండలేనో చందమామా ఒక్కదానీ కోనలో |
| ఒంటి బ్రతుకు వద్దట ఈ పిల్లకు. ఇకనేమి? ఊరిముందర చేను! కాకులకు పండుగ. |