| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
163. చెయ్యి మీద చెయ్యి
| దూరి సూడూ దుక్కి సూడూ, దున్నపోతుల మడక సూడూ వుండరాదుర ముండమోపులూ, బంగారిసామి వుండరాదుర ముండమోపులూ ఆరుగంపా దూరుగంపా, బాలుడేసిన తుమ్మకంపా తుమ్మకంపలు దూరిపోతబ్బీ, బంగారిసామి తుమ్మముల్లు రొమ్ము నాటేనూ అంచునంచున వరుసలేసీ, పంచెవన్నెల ముగ్గులేసీ అరుగుమీదా పండుకొంటీరా, బంగారిసామి ఆడుదానీ బాసలేడరా ఏటిగడ్డా సేనివాడా, ఏపకవురూ మంచెవాడా ఎన్ను మీదా గువ్వ వాలెనురా, బంగారిసామి సెయ్యి మీదా సెయ్యి దియ్యిరా! |
| ఎవరో చూచుచున్నారని సూచన! |