| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
176. రానుపోర
| రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ నన్ను నీవెరుగవా 1 కన్ను గిరతలలోనె కనుగొన్నావా రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ 2 తొమ్మిది చేరలా తూగుటుయ్యాలలో ఏజోలి లేకున్న నా జోలి నీకేల రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ 3 నిండు పున్నమనాడు పండు వెన్నెలలోన పరుపున్న తొట్టెలో పండినిండున్నాను రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ |
| ఇది కృష్ణుని మీద పాట. చరణములు చాలా ఉన్నట్టు కనబడుతున్నది. హాస్యపు పాటలు అన్న చిల్లరపుస్తకములో ముక్తికాంతయే ఈ మాటలంటున్నట్టుగా ఉన్నది. శృంగారములో ప్రేమ ముదిరితే భక్తి అయిపోవటము వింత ఏమిటి? |